చరిత్రలో మే మాసం

మే 1

అంతర్జాతీయ కార్మికదినోత్సవము ... మే డే.
1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
1945: అడాల్ఫ్ హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది.
1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
1971: ప్రముఖ భారతీయ నటుడు అజిత్ కుమార్ జన్మదినం.
1988: ప్రముఖ భారతీయ నటి అనుష్క శర్మ జన్మదినం.
2008: ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్‌పాండే మరణం (జ. 1929).
2009: మన్యసీమ తెలుగు మాసపత్రిక తొలి ప్రచురణ.

మే 2

1519 : గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి మరణం.(జననం.1452).
1911: తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. పి.పుల్లయ్య జననం .(మ. 1985)
1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు సత్యజిత్ రే జననం.(మరణం.1992)(ప్రక్క చిత్రంలో)
1929 : ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు పెనుమర్తి విశ్వనాథశాస్త్రి జననం.
1969 : వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా జననం
2011 : బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో, అమెరికన్ సి.ఐ.ఏ కాల్చి చంపింది.

మే 3

1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు సేవలు,మొదటి సారిగా మొదలయ్యాయి.
1913 : భారత దేశం సినీ చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
1932 : ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ జననం.(మరణం.2006)
1939 : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
1969 : భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం.(జననం.1897)
1981 – భారత సినిమా నటి నర్గీస్ మరణం.(జననం. 1929)

మే 4

1008 : ఫ్రాన్సు చక్రవర్తి మొదటి హెన్రీ జననం.(మరణం.1060)
1767 : కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు జననం.(మరణం.1847)
1799 : ప్రముఖ మైసూరు రాజు.టిప్పు సుల్తాన్ మరణం.(జననం.1750)
1947 : ప్రముఖ రాజకీయవేత్త, సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత దాసరి నారాయణరావు జననం.
1979 : ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
1979 : ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం మరణం.(జననం.1894).(చిత్రంలో)

మే 5

1494 : క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
1821 : ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్ మరణం.(జ.1769)
1916 : భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ జననం.(మరణం.1987)
1930 : ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం.(మ.1996)(చిత్రంలో)
1955 : పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది.
1989 : భారతీయ సినీ నటి లక్ష్మీ రాయ్ జననం.
1995 : తెలుగు సినిమా నటుడు,రంగస్థల నటుడు నాగభూషణం మరణం.
2003 : దక్షిణాఫ్రికా ఉద్యమనేత వాల్టర్ సిసులు మరణం.

మే 6

1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం.(మ.1920)
1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం.(మ.1931)
1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం (మ.1918)
1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ హెన్రీ మరణం.
1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం.
1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.
1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.

మే 7

1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.(మ.1941)
1921 : తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ జననం.(మ.1989)
1924 : స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణం.(జ.1897)
1946 : సోని కార్పొరేషన్ ను జపాన్ లో స్థాపించారు.
1972 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం.(జ.1921)
1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.

మే 8

1864: రెడ్‌క్రాస్ సంస్థ స్థాపించబడింది.
1886: న్యూయార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 1150 కి.మీ. దూరంలో ఉన్న అట్లాంటా లో జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా పానీయమును తయారుచేసాడు.
1965 : భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి షైనీ అబ్రహం జననం.
1973 : ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణం.(జ.1887 )
1973 : తెలుగు సినీపరిశ్రమలో జర్నలిస్ట్, రచయిత బులెమోని వెంకటేశ్వర్లు జననం.

మే 9

1408 : తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జననం.(చిత్రంలో)
1540 : మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు రాణాప్రతాప్ జననం.
1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే జననం(మ.1915)
1933 : ప్రముఖ నాదస్వర విద్వాంసులు దోమాడ చిట్టబ్బాయి జననం.
1950 : ప్రముఖ తెలుగు హాస్యనటి కల్పనా రాయ్ జననం.
1950 : తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు ఎం. ఎస్. నారాయణ జననం.
1954 : సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె మల్లికా సారాభాయ్ జననం.
1970 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి మరణం.
1981 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం.(జ.1909)
1986 : ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత, టెన్సింగ్ నార్కే మరణం.(జ.1914)

మే 10

1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం.(జ. 1715)
1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)
1857 : భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికా లోని పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.
1922 : నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కొర్రపాటి గంగాధరరావు జననం.
1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.
1986 : ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జననం.
1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
1994 : నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.(చిత్రం లో)
2002 :తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం.

మే 11

2014 : మాతృ దినోత్సవం
1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం.
1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జనన (మ.2000).
1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).
1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.
1977 : తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం.
1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.

మే 12

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. (మ.1910).
1871 : నక్షత్ర మేఘాల పట్టికను తయారుచేసిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్ మరణం (జ.1792).
1895 : జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త జననం (మ. 1986)
1920 : ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు వింజమూరి అనసూయ జననం.
1924 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం (మ.1999).
1937 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు జార్జ్ కార్లిన్ జననం.
1985 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం.
1986 : అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
1992 : ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్‌గ్రిడ్ బేయెన్స్'.

మే 13

1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932)(చిత్రంలో)
1905 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జననం.(మ.1977)
1918 : భారత నృత్య కళాకారిణి బాలసరస్వతి జననం.(మ. 1984)
1939 : మొట్టమొదటి వాణిజ్య ఎఫ్. ఎం. రేడియో WDRC మొదలైన రోజు.
1952 : భారతదేశ ప్రధమ లోక్‌సభ తొలిసారిగా సమావేశమైంది.
1956 : ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవి శంకర్ జననం.
1962 : భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారం చేపట్టాడు.
1969 : ప్రముఖ రాజకీయ వేత్త అసదుద్దీన్ ఒవైసీ జననం.
2001 :ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ మరణం

మే 14

మాతృ దినోత్సవం. దేవమాత రియాకు నివాళులు అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీకు దేశంలో నిర్వహించారు.
1574 : ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణం.(జ. 1479)(చిత్రంలో)
1657 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జననం.
1811 : పరాగ్వే జాతీయదినోత్సవం. ఈ రోజు స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
1946 : కృత్రిమ గుండె "జార్విక్ 7" ను కనిపెట్టిన వైద్యుడు రాబర్ట్ జార్విక్ జననం.
1984 : అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ జననం.
1987 : తెలుగు, మళయాళ మరియు హిందీ చిత్రాల నటీమణి మధురిమ జననం.
2004 : డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
అంతర్జాతీయ వలసపక్షుల దినం

మే 15

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
1803: గోదావరి కి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ఇంగ్లాండు లో జననం (మ.1899)
1817 : భారత మత సంస్కర్త, దేవేంద్రనాథ్ ఠాగూర్ జననం.(మ.1905)
1859 : ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం.(మ. 1906)
1907 : భారత స్వాతంత్ర్యోద్యమకారుడు సుఖ్‌దేవ్ జననం.(మ. 1931)
1923 : భారత సినిమా నటుడు జానీవాకర్ జననం. (మ.2003)
1928: మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది.
1967 : ప్రముఖ సినీ నటి మాథురీ దీక్షిత్ జననం.

మే 16

డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
1804: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
1830: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
1831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900).
1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజల కు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
1960: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది
1996: భారత ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
2007: వై.యస్.రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా 3 ఏళ్ళు పూర్తి చేశాడు.

మే 17

నార్వే జాతీయదినోత్సవం
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం
1749 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ జననం(మ1823).
1945 :భారత క్రికెటర్ బి.ఎస్.చంద్రశేఖర్ జననం.
1865: మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని పారిసు లో ఆమోదించారు.
2007 : భారత దేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామి మరణం(జ. 1921).

మే 18

1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).
1876: తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం (మ.1923).(చిత్రంలో)
1894: ప్రముఖ స్త్రీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం జననం (మ.1979).
1913: భారత రాష్ట్రపతి గా, పనిచేసిన నీలం సంజీవరెడ్డి జననం (మ.1996).
1974: భారత్ మొట్టమొదటి సారిగా రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది.
1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు మరణం (జ.1902)
1987: ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).
2007: హైదరాబాదు మక్కా మసీదు లో బాంబులు పేలాయి.

మే 19

1890: అమెరికా ను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు హొ చి మిన్ జననం (మ.1969).
1894 : సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త గుడిపాటి వెంకట చలం జననం (మ.1979).
1904 : భారత దేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు జమ్సేట్జి టాటా మరణం (జ.1839).
1913 : భారత 6 వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జననం. (మ.1996)(చిత్రంలో)
1938 : ప్రముఖ రచయిత,నటుడు,సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం.
1952 : భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ మరణం (జ.1878).
1955 : కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వాడు అయిన జేమ్స్ గోస్లింగ్ జననం.
1970 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు మరణం (జ.1894).
1985: కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం (జ.1913).

మే 20

1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
1506 : అమెరికా ను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
1955 : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
1983 : సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.(చిత్రంలో)
1984 : తెలుగు నటుడు, మరియు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ జననం.
1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
సమ్మక్క - సారక్క జాతర ముగింపు రోజు.

మే 21

ఉత్తర ధృవంపై డ్రిప్టింగ్ ఐస్ స్టేషన్ వద్ద ఇవాన్ పాపనిన్
1502 : 'సెయింట్ హెలెనా' దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ 'జో డ నోవా' కనుగొన్నాడు.
1829 : సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం (జ.1768 ).
1886 : ప్రాణవాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే మరణం (జ.1742).
1937 : ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
1991 : భారత 6 వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణం (జ.1944).
1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ ,18 సంవత్సరాల వయసులో, 43వ విశ్వ సుందరి గా ఎన్నికైంది.

మే 22

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.
యెమన్ జాతీయదినోత్సవం
1772 : సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జననం. (మ. 1833).(చిత్రంలో)
1888 : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం.
1942 : రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది.
1948 : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
1952 : ప్రముఖ హేతువాది గుమ్మా వీరన్న జననం.
2004 : భారత 12వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ -13వ ప్రధాని)
2008 : నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
2009 : భారత 13వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు.
2010 : మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
2010 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం. (జ.1936)

మే 23

1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం.
1984: మొట్టమొదటి సారిగా ఒక భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం.(చిత్రంలో)
1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.
1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం.
1965 : తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం.
1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.

మే 24

1543 : మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలాస్ కోపర్నికస్ మరణం.
1819: బ్రిటన్‌ రాణి విక్టోరియా జననం (మ. 1901).(చిత్రంలో)
1844: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920 లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ గా అవతరించినది.
2013 : ప్రముఖ రచయిత, సాహితీ వేత్త రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు మరణం.

మే 25

1865 : నోబెల్ బహుమతి గ్రహీత, డచ్చి భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం (మ. 1943).
1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్‌ బిహారి బోస్‌ జననం (మ. 1945)(చిత్రంలో)
1897 : స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి కల్లూరు సుబ్బారావు జననం.
1899 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం (మ.1976 ).
1924 : బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ మరణం.
1936 : భారత క్రికెటర్ రూసీ సూర్తీ జననం. (మ. 2013).
1972 : భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు కరణ్ జోహార్ జననం.
1975 : స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి పద్మజా నాయుడు మరణం.
2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

మే 26

1894: రష్యా జార్‌ గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
1942 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త గణపతి సచ్చిదానంద స్వామి జననం.
1949 : మొట్టమొదట వికీపీడియా ను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్ కన్నింగ్‌హమ్ జననం.
1945 : భారత రాజకీయవేత్త విలాస్‌రావు దేశ్‌ముఖ్ జననం. (మ. 2012).
1969 : చంద్రుని పైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
1972 : అమెరికా, సోవియట్ యూనియన్ లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
1986 : యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది
2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.

మే 27

1332 : ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, మరియు రాజకీయ వేత్త ఇబ్నె ఖుల్దూన్ జననం.
1910 : జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు మరియు శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ మరణం.
1919 : భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణం (జ. 1848).
1931 : మలయాళంలో ప్రసిద్ధ కవి, సినీ గేయకర్త ఒ.ఎన్.వి.కురుప్ జననం.(చిత్రంలో)
1934 : రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీ లో ప్రారంభమయ్యాయి.
1962 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు రవిశాస్త్రి జననం.
1964 : భారత తాత్కాలిక ప్రధానమంత్రి గా గుల్జారీ లాల్ నందా నియామకం.
1964 : భారత దేశపు ప్రథమ ప్రధాన మంత్రిజవహర్ లాల్ నెహ్రూ మరణం (జ.1889).
1980 : ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు మరణం.
1982 : రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక అంకిత జననం.

మే 28

నందమూరి తారక రామారావు
1896 : పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి జననం (మ. 1953).
1923 : నందమూరి తారక రామారావు జననం (మ.1996).
1994 : ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
1997 : కుమ్మరి మాస్టారు అని పిలువబడే, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారుడు, దార అప్పలనారాయణ మరణం (జ.1930).
2008 : సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

మే 29

1932 : కొప్పరపు సోదర కవులు లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం (జ.1885).
1953 : టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు.(చిత్రంలో)
1829 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ మరణం (జ.1778)
1903 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి బాబ్ హోప్ జననం (మ.2003).
1980 : తెలుగు నేపథ్య గాయని ఉష జననం.
1987 : భారత దేశ 5 వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ మరణం (జ.1902)
1987 : మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత పి.పుల్లయ్య మరణం (జ.1911).

మే 30

1921: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కంచనపల్లి పెదవెంకటరామారావు జననం.
1987 : గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.
1962 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
2007 : ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం.(జ.1927)
2008 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

మే 31

ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం. (ప్రపంచ పొగాకు దినం)
526 : టర్కీ లో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1725 : మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జననం.
1911 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం (మ.2010).
1930 : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం.
1942 : తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు సూపర్‌స్టార్ కృష్ణ జననం.
1964 : స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ మరణం.
2002 : దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.

చరిత్రలో ఏప్రిల్ మాసం

ఏప్రిల్ 1

1578 : గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ప్రముఖ ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం (మ.1657).
1889 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కె.బి.హెడ్గేవార్ జననం (మ.1940).
1911 : ప్రముఖ మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య జననం (మ.1949).
1914 : కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది.
1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
1935 : భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒరిస్సా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1941 : భారత దేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ జననం.

ఏప్రిల్ 2

1725 : వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత గియాకోమో కాసనోవా జననం (1798).
1872 : అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791).
1915 : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం (మ.1969).
1969 : భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జననం.
1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్‌ సింహ్‌జీ మరణించాడు(జ.1872). ఈయన పేరిటే భారత్‌ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
1972 : చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు
2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

ఏప్రిల్ 3

1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్ జననం.
1961 : అమెరికన్ నటుడు, గాత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు ఎడీ మర్ఫీ జననం.
1962 : జయప్రద, తెలుగు సినీనటి మరియు పార్లమెంటు సభ్యురాలు జననం.
1964 : భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
1680 : ఛత్రపతి శివాజీ మరణం .
1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
1973 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
1984 : మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.

ఏప్రిల్ 4

1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
1905 : కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.
1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832).
1968 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).
1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
1979 : ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).

ఏప్రిల్ 5

1908 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు జగ్జీవన్ రామ్ జననం (మ.1986).
1922 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం (జ.1858).
1930 : మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.
1937 : భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.
1993 : భారతీయ సినిమానటి దివ్యభారతి మరణం (జ.1974).
1994 : అమెరికాకు చెందిన ఒక పాటల రచయిత మరియు స్వరకర్త కర్ట్ కోబెన్ మరణం (జ.1967).

ఏప్రిల్ 6

1896 : 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
1922 : వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు జననం.
1928 : DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు.
1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది.
1931 : ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు.
1956 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం.
1989 : ప్రముఖ గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం.
2002 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరణం.
2011 : మలయాళ నటి సుజాత మరణం.

ఏప్రిల్ 7

ప్రపంచ ఆరోగ్య దినం
1770 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ జననం (మ.1850).
1885 : సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత గబ్రియేలా మిస్ట్రాల్ జననం (మ.1957).
1920 : భారతీయ సంగీత విద్వాంసుడు రవి శంకర్, జననం.(మరణం . 2012)
1925 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య జననం (మ.2012).
1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.
1857 : బ్రిటిష్ వారు మంగళ్ పాండేని ఉరితీసి, దళం మొత్తాన్ని విధులనుండి బహిష్కరించారు.
1962 : భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత రాం గోపాల్ వర్మ జననం.
1991 : ప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి మరణం (జ.1918).
2007 : ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణం (జ.1917).

ఏప్రిల్ 8

1846 : ప్రసిద్ధ కవి, పండితుడు దాసు శ్రీరాములు జననం (మ.1908).
1894 : వందేమాతరం గీత రచయిత, బంకించంద్ర ఛటర్జీ మరణం (జ.1838).
1904 : బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం (మ.1989).
1938 : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం .
1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడిక పై సంతకాలు చేశాయి.
1857 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం (జ.1827).
1977 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం (జ.1914).
1983 : అల్లు అర్జున్ జననం.
1984 : ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం.
2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం (జ.1925).

ఏప్రిల్ 9

1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
1893 : ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.( మ. 1963)
1930 : ప్రముఖ సినిమా నటుడు మన్నవ బాలయ్య జననం.
1936 : పాలస్తీనాకు చెందిన రచయిత ఘసన్ కనాఫానీ జననం (మ.1972).
1948 : ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ జననం.
1989 : ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా మరణం (జ.1929).
1994 : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
2011 :అన్నా హజారే కు ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం లభించింది.

ఏప్రిల్ 10

1755 : హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం .
1857 : భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మొదలయ్యింది.
1809 : ప్రముఖ అధ్యాపకుడు మరియు పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం.
1813 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం.
1894 : ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం.
1898 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ జననం.
1931 : ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం.
1995 : భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం

ఏప్రిల్ 11

1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
1827 : ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతీరావ్ పూలే జననం. (మ.1890)
1869 : భారత స్వాతంత్రోద్యమ కర్త,మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబాయి గాంధీ జననం.(మ. 1944)
1904 : భారత ప్రఖ్యాత గాయకుడు మరియు నటుడు కుందన్ లాల్ సైగల్ జననం.(మ. 1947)

ఏప్రిల్ 12

599 BC: జైన మతం స్థాపించిన మహావీరుడి జననం (మ. 527 BC)
1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
1962 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం (జ. 1861)
1981 : ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) "కొలంబియా" ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
2006 : ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు గాయకుడు రాజ్‌కుమార్ మరణం (జ. 1929)

ఏప్రిల్ 13

1905 - న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, జననం (మ.1984).
1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు.
2007: ప్రసిద్ధ సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం.(జ.1921)
2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.(జ.1933)

ఏప్రిల్ 14

అగ్నిమాపక దళ దినం.
1893: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బి.ఆర్.అంబేద్కర్ జననం.(మ.1956)
1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
1939 : సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహితీకారుడు గొల్లపూడి మారుతీరావు జననం.
1950 : శ్రీ రమణ మహర్షి , భారత తత్వవేత్త. మరణం.(జ. 1879)
1963: ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ మరణం.( జ. 1893 )
1968 : ప్రముఖ హేతువాది , మానవతా వాది బాబు గోగినేని జననం.

ఏప్రిల్ 15

1452 : గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి జననం.(మరణం.1519)
1469 : భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.(మరణం . 1539)
1707 : లియొనార్డ్ ఆయిలర్, ప్రసిద్ధ స్విస్ గణిత శాస్త్రవేత్త జననం.(మరణం . 1783)
1865 : అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం.(జననం.1909)
1925 : గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది.

ఏప్రిల్ 16

1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన మరియు ఉపవాసం" నిర్వహించాడు.
1848 : ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జననం ( మ.1919 )
1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.
1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం (మ.1977)
1946: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ మరణం (జ.1880)

ఏప్రిల్ 17

1790 : గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం.
1946: ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం ( జ. 1867).
1961 : ప్రముఖ బిలియర్డ్స్ ఆటాగాడు గీత్ సేథి జననం.
1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
1966: తమిళ సినిమా హీరో విక్రం జననం.
1972 : శ్రీలంక కు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జననం.
1975: భారత మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం. (జ.1888).(చిత్రం లో)
2004: ప్రముఖ సినిమా నటి సౌందర్య మరణం. (జ. 1972).

ఏప్రిల్ 18

1858 : ప్రముఖ మహిళోద్ధారకుడు, భారతరత్న పురస్కార గ్రహీత ధొండొ కేశవ కర్వే జననం.
1859 : తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు మరణం.(జ. 1814)
1880 : ప్రముఖ విమర్శకులు మరియు పండితులు టేకుమళ్ళ అచ్యుతరావు జననం.
1923 : అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
1930 : భారత స్వాతంత్ర్యోద్యమము లోసూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
1955 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం. (జ. 1879)(ప్రక్క చిత్రంలో)
1958: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్ జననం. (మ.1999)

ఏప్రిల్ 19

1882 : ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ మరణం.
1906 : ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పియరీ క్యూరీ మరణం (జ. 1859).
1957 : రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం.(ప్రక్క చిత్రంలో)
1969 : సిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి మరణం.
1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
1977 : ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం విజేత అంజు బాబీ జార్జ్ జననం.
2006 : అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.

ఏప్రిల్ 20

570: ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం (వివాదాస్పదము)
1526 : మొదటి పానిపట్టు యుద్ధం లో ఇబ్రహీం లోడీని బాబరు ఓడించాడు.
1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం.
1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం.(మ. 1945)
1904 : ప్రముఖ తొలితరం తమిళ సినిమా నిర్మాత మరియు దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం.
1950 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.(ప్రక్క చిత్రంలో)
1955 : మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త తిరుక్కన్నపురం విజయరాఘవన్ మరణం.
1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
1992 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మరణం.

ఏప్రిల్ 21

1938 : ఉర్ధూ మరియు పారశీక భాషా కవి, సారే జహాసె అచ్చా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ మరణం. (జ. 1877).
1944 : ఫ్రాన్స్ లో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు.
1994 : సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1997 : భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
2013 : ప్రపంచ ప్రసిద్ద గణిత, ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త.శకుంతలా దేవి మరణం.(జ.1929)

ఏప్రిల్ 22

1870 : రష్యా విప్లవనేత లెనిన్ జననం (మరణం 1924).
1914 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్.ఛోప్రా జననం (మరణం 2008).(ప్రక్క చిత్రంలో)
1936 : జాతీయ బీసీ కమిషన్‌ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి మకాని నారాయణరావు జననం.
1959 : భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.
1970 : ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవం గా ప్రకటించింది. మొదటి ధరిత్రీ దినోత్సవం.
1971 : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు (స్వీడను దేశస్థుడు) నిక్లాస్ కుల్టి జననం.
1980 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మాన్ మరణం (జననం 1902).
1994: అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం (జననం 1913).

ఏప్రిల్ 23

1616 : ప్రముఖ నాటక రచయిత విలియం షేక్‌స్పియర్ మరణం.
1850 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ మరణం. (జ.1770)
1858 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ జననం.(మ. 1947)
1858 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి జననం.
1891 : ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం.(మరణం.1961)
1938 : ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకి జననం.(ప్రక్క చిత్రంలో)
1992 : ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం.(జననం.1921)
2007 :రష్యా లోని ప్రముఖ రాజకీయ వేత్త బోరిస్ యెల్సిన్ మరణం.(జననం.1931)

ఏప్రిల్ 24


1927 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు నండూరి రామమోహనరావు జననం.
1929 : కన్నడ ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవుడుగా పేరుపొందిన రాజ్ కుమార్ జననం.
1969 : సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం.
1970 : మొదటిసారి చైనా "డాంగ్ ఫాంగ్ హాంగ్ 1" అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
1973 : ప్రముఖ భారతదేశ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ జననం.(ప్రక్క చిత్రంలో)
1974 : ప్రముఖ హిందీ కవి రామ్‌ధారీ సింహ్ దినకర్ మరణం.(జననం.1908)
1993 : పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
2005 : దక్షిణ కొరియా లో మొదటిసారి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క స్నప్పీ
2011 : ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్య సాయి బాబా మరణం.(జ. 1926)

ఏప్రిల్ 25

1874 : ప్రముఖ శాస్త్రవేత్త రేడియో ఆవిష్కర్త గూగ్లి ఎల్మో మార్కోని జననం. (మ.1937)(ప్రక్క చిత్రంలో)
1900 : వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత జననం (మ. 1958)
1974 : ప్రముఖ సినిమా నటి దివ్యభారతి జననం.
1992 : ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వెంకటరావు మరణం.
2005 : స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు మరణం.(జ. 1908)
2005 : అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి మరణం (జ.1925)

ఏప్రిల్ 26

570 : ఇస్లాం మతస్థాపకుడు మహమ్మదు ప్రవక్త జననం.(మ. 632)
1762 : సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి జననం.
1904 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య జననం.
1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
1920 : భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం.(జ. 1887)(ప్రక్క చిత్రంలో)
1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగినది.
1987 : ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్ లలో శంకర్ మరణం.

ఏప్రిల్ 27

1791 : అమెరికన్ శాస్త్రవేత్త,టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త,చిత్రకారుడు శామ్యూల్ మోర్స్ జననం.(మ. 1872)(ప్రక్క చిత్రంలో)
1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభం.
1955 : గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.
1974 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం.
1989 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తమనపల్లి అమృతరావు మరణం.
1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
2004 : శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం.
2009 : ప్రముఖ హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం.(జ.1939)

ఏప్రిల్ 28

1758 : అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో జననం.(మ. 1831)
1881 : సుప్రసిద్ధ నాటక కర్త...సంఘ సంస్కర్త... ప్రథమాంధ్ర ప్రచురణ కర్త కాళ్ళకూరి నారాయణరావు జననం.
1897 : ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు జననం.
1946 : ప్రముఖ రాజకీయవేత్త కోటగిరి విద్యాధరరావు జననం.
1978 : మహమ్మద్ దావుద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు మరణం. (జ. 1909)
1987 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య మరణం.
1992 : కన్నడ భాష చెందిన సాహిత్యవేత్త.కన్నడ ప్రసిద్ధకవి వినాయక కృష్ణ గోకాక్ మరణం.
1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్ మరణం.(జ.1939)
2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు

ఏప్రిల్ 29

1917 : ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం.
1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
1848 : భారత ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జననం.(మ.1906)(చిత్రంలో)
1970 : ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రి అగస్సీ జననం.
1979 : భారత క్రికెట్ క్రీడాకారుడుఆశిష్ నెహ్రా జననం.
2003 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1906)

ఏప్రిల్ 30

1777 : జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ జననం.
1870 : భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం.(మ.1944)( చిత్రంలో)
1945 : జర్మనీలో నాజీ పార్టీ వ్యవస్థాపకుడు ఎడాల్ఫ్ హిట్లర్ మరణం.
1946 : మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1910 : మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) జననం. (మరణం 1983)
1968 : ప్రముఖ మత్తుమందు వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు దాడిచిలుక వీర గౌరీశంకర రావు జననం.
1987 : భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ జననం.

చరిత్రలో మార్చి మాసం

మార్చి 1

1901 : ఆంధ్ర రాష్ట్ర ప్రధమ శాసనసభ సభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం (మ.1983).
1908 : సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఖండవల్లి లక్ష్మీరంజనం జననం (మ.1986).
1947 : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రారంభం.
1968 : భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరని దేవి జననం.
1969 : భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.

మార్చి 2

1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1935 : ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు జననం.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
1949: స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రిసరోజినీ నాయుడు మరణం.(జ.1879).
1977 : ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత క్రిస్ మార్టిన్ జననం.

మార్చి 3

1847 : టెలిఫోను ను కనుక్కున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ జననం (మ.1922).
1895 : నార్వే ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ జననం.
1937 : ప్రముఖ తెలుగు రచయిత సత్యం శంకరమంచి జననం.
1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.
1982 : అమెరికా నటీమణి మరియు పూర్వపు మోడల్ జెస్సికా బీల్ జననం.
1991 : కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము (విశాఖపట్నం).
2002 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి మరణం.

మార్చి 4

భారత జాతీయ భద్రతా దినోత్సవం.
1680: పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మరణం.
1856 : ప్రముఖ భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.
1973 : తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం.
1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.
1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.

మార్చి 5

1827 : ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు పియర్ సైమన్ లాప్లేస్ మరణం (జ.1749).
1901 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు కల్యాణం రఘురామయ్య జననం (మ.1975).
1913 : కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు గంగూబాయి హనగల్ జననం (మ.2009).
1931 : గాంధీ- ఇర్విన్ ఒడంబడిక కుదిరింది.
1937 : కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు అయిన నెమలికంటి తారకరామారావు జననం.
1953 : రష్యా నేత సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మరణం (జ.1878).
1987 : రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే జననం.

మార్చి 6

1475: ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం (మ.1564).
1913 : హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).
1978: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు పదవీ విరమణ (10 డిసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
ఏడవ ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు (ఆయన పదవీకాలం 6 మార్చి 1978 నుంచి 11 అక్టోబర్ 1980 వరకు)

మార్చి 7

1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం.
1938 : అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీతడేవిడ్ బాల్టిమోర్జననం.
1952 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.
1952 : పరమహంస యోగానంద పరమపదించారు.(జ.1893)
1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం.
1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం.

మార్చి 8

అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1879 : కేంద్రక విచ్చిత్తి పై విశేషమైన కృషిచేసి నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త అట్టోహాన్ జననం.
1897 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు జననం.
1917 : ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం.
1921 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి జననం.
1974 : ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.

మార్చి 9

1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది.
1934 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కిన రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ జననం (మ.1968).
1934 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదు లో పర్యటించాడు.
1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1979 : గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం (జ.1890).
1981 : మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్‌ డెల్‌బ్రక్ మరణం (జ.1906).
1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.
1994 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం (జ.1908).
1997 : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణం (జ.1907).

మార్చి 10

భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం.
1876: టెలిఫోనును కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ దానిని మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్క గది లోని వాట్సన్‌తో మాట్లాడాడు.
1985: భారత్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచ క్రికెట్ చాంపియన్ ట్రోఫీ గెలిచింది.

మార్చి 11

1689 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం.
1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం.
1955 : పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు.
1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2013 : రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం.

మార్చి 12

మారిషస్ గణతంత్ర దినోత్సవం
1930: భారత స్వాతంత్ర ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.
1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించాడు.
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంఛి 12 మార్చి 1962 వరకు).
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంఛి 29 ఫిబ్రవరి 1964 వరకు).

మార్చి 13

1733: ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.
1889: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.
1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
1963: అర్జున అవార్డును ప్రారంభించారు.

మార్చి 14

1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.
1879: ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉల్మ్, జర్మనీలో జన్మించాడు.
1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1917: స్వరబ్రహ్మగా పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కె.వి. మహదేవన్ జన్మించాడు.
1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలో విడుదలయ్యింది.

మార్చి 15

1493 :అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
1564 : మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1767 : అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్జననం.
1915 : మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1934 : భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాంజననం. (మరణం: 2006)
1937 : ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్యజననం.
1977 : భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008)
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

మార్చి 16

1901 : అమరజీవి పొట్టి శ్రీరాములు జననం.
1925 : తెలుగు కథను సుసంపన్నం చేసిన రచయిత మునిపల్లె రాజు జననం.
1928 : రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత ఉషశ్రీ జననం.
1935 : నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్ మరణం.
1953 : అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్ రిచర్డ్ స్టాల్‌మన్ జననం.
1969 : బార్బడస్ కు చెందిన వెస్ట్‌ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఓటిస్ గిబ్సన్ జననం.
1993 : శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు శ్రీరంగం గోపాలరత్నం జననం.

మార్చి 17

ప్రపంచ వికలాంగుల దినోత్సవం
763 : ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా హారూన్ రషీద్ జననం.
1892 : ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు జన్మించాడు.
1896 : పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు జననం.
1962 : ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా జననం.
1963 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం.
1975 : పంజాబీ గాయకుడు-పాటల రచయిత, నటుడు, మరియు నిర్మాత బబ్బూ మన్ జననం.
1982 : కేరళలో రాష్ట్రపతి పాలన
1990 : ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ సైనా నెహ్వాల్ జననం.

మార్చి 18

భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.
1858 : రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త జననం (మరణం:1913).
1871 : భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం (జననం:1806).
1922 : మహత్మా గాంధీ కి, శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు, 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడింది.
1837 : అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం (మ.1908).
1938 : ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.
1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.

మార్చి 19

1900 : ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958)
1952 : తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం.
1954 : ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.
1955 : అమెరికన్ నటుడు, నిర్మాత మరియు సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.
1966 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.
1982 : ఆచార్య జె.బి.కృపలానీ మరణం.
1984 : భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా జననం.
2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్ మరణం.(జననం.1958)

మార్చి 20

1351 : ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.
1602 : డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
1726 : ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మరణం. (జననం;1642)
1855 : మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్న జె.ఏస్పిడిన్ మరణం..(జ.1788)
1951] : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.
1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం.
2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.
2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం

మార్చి 21

అంతర్జాతీయ ఎర్త్ డే (భూగోళ దినోత్సవము)
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలనా దినం
ప్రపంచ అటవీ దినోత్సవం
భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు.
1768: ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం (మ.1830).
1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం (మరణం:2006).
1923: సహజ యోగ సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ నిర్మల శ్రీవాత్సవ జననం (మరణం:2011).
1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ జననం.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియా కు స్వాతంత్ర్యం.

మార్చి 22

ప్రపంచ జల దినోత్సవం
1739 : నాదిర్షా ఢిల్లీ ని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లబించింది.
1957 : భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.
1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
2000 : భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
2007 : ప్రముఖ భారత తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి మరణం. (జననం:1918)
2009: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావుమరణం.

మార్చి 23

ప్రపంచ వాతావరణ దినోత్సవం
1749 : ప్రముఖ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ జననం. (మ.1827)
1893 : భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త,ఇంజనీర్ జి.డి.నాయుడు జననం. (మరణం:1974)
1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జన్మించాడు.
1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్(జ. 1907),రాజ్ గురు(జ. 1908) మరియు సుఖ్ దేవ్(జ. 1907) లు ఉరి తీయబడ్డారు.
1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది.(పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)
1992: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్ మరణం.
1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు

మార్చి 24

1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.
1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1998 : భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.

మార్చి 25

1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్జననం.
1927 : పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.(మరణం.2013)
1983 : ప్రముఖ పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.

మార్చి 26

1875 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ జననం.(మరణం. 1922)
1933 : ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.
1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
2006 : ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)
2006 : తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుమరణం.
2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.

మార్చి 27

ప్రపంచ రంగస్థల దినోత్సవం
1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)
1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.
1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.
1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
2008: వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.

మార్చి 28

1552 : భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణించారు. (జననం.1504)
1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ జన్మించాడు.
1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు.
1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించాడు.
1955: ఆంధ్ర రాష్ట్ర్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు
1955:స్వాతంత్ర్య సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.
2006 : భారత తత్వవేత్త వేథాత్రి మహర్షి మరణం. (జననం. 1911)

మార్చి 29

1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.
1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.
1952 : ప్రముఖ రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం.
1953 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం.
1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు.
1997 : భరతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ మరణం.

మార్చి 30

1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం.
1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడుజమలాపురం కేశవరావు మరణం.
1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
2002 : ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్ బక్షీ మరణం.(b. 1930)
2005 : ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ మరణం. (జననం.1930)
2011 : ప్రసిద్ది చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం.

మార్చి 31

1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).
1919 : హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
1928 : పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ప్రముఖుడు కపిలవాయి లింగమూర్తి జననం.
1933 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ జననం (మ.2011).
1959 : 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణ (జననం.1932)
1987 : ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి జననం.
1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)

చరిత్రలో ఫిబ్రవరి మాసం

ఫిబ్రవరి 1

భారతీయ తపాలా బీమా దినం.
1929 : తెలుగు భాషాభిమాని, సాహితీకారుడు, కవి జువ్వాడి గౌతమరావు జననం.
1945 : భారతీయ సాంకేతిక నిపుణుడు బొజ్జి రాజారాం జననం.
1956 : ప్రముఖ తెలుగు. తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత సుధాకర్ జననం.
1956 : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందం జననం.
1971 : భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.
1977 : భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1986 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ మరణం.
2003 : అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం.

ఫిబ్రవరి 2

1902 : దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జననం.
1913 : జపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త మసనోబు ఫుకుఒక జననం.
1925 : ప్రముఖ సాహితీకారుడు తిమ్మావజ్జల కోదండ రామయ్య జననం.
1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం.
1970 : ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది బెర్ట్రాండ్ రస్సెల్ మరణం.
1971 : ఒంగోలు జిల్లా ఏర్పాటయింది. తరువాత దీని పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.
1978 : ప్రముఖ కవి,రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం.
1985 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.

ఫిబ్రవరి 3

1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
1923 : నిజాం విమోచన కారుడు తమ్మర గణపతిశాస్త్రి జననం.
1924 : అమెరికా 28 వ అధ్యక్షులు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.(జ. 1856)
1963 : భారత రిజర్వ్‌ బ్యాంకు 23 వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం.
1975 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ మరణం.

ఫిబ్రవరి 4

1509 : శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
1891 : స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు మాడభూషి అనంతశయనం అయ్యంగారు జననం.
1911 : ప్రముఖ కవి, పండితుడు వేదుల సూర్యనారాయణ శర్మ జననం.(మ.1999)
1936 : సుప్రసిద్ధ హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
1938 : భారతీయ కథక్ నాట్య కళాకారుడు బిర్జూ మహరాజ్ జననం.
1943 : భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
1962 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ జననం.
1974: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం.

ఫిబ్రవరి 5

1915 : ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం (మ.1963).
1920 : బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జననం (మ.1997).
1936 : కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.
1961 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి మరణం (జ.1915).
1976 : భారతీయనటుడు మరియు భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ జననం.
2008 : ప్రముఖ ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేశ్ యోగి మరణం (జ.1918).

ఫిబ్రవరి 6

1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణించాడు.
1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
1925: ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.

ఫిబ్రవరి 7

1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.
1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జన్మించారు.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.

ఫిబ్రవరి 8

1880: ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జన్మించాడు.
1897: పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జన్మించాడు.
1971: నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.వం.మున్షీ మరణించాడు.

ఫిబ్రవరి 9

1936 : నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన అడబాల జననం (మ.2013).
1939 : ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు జననం (మ.2011).
1954 : ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు పరోపకారి క్రిస్ గార్డనర్ జననం.
1968 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు రాహుల్ రాయ్ జననం.
1969 : బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.
1976 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు సుమంత్ జననం.
1996 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మరియు వైణికుడు చిట్టిబాబు మరణం (జ.1936).
2008 : ప్రసిద్ధ సంఘ సేవకుడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) మరణం (మ.1914).

ఫిబ్రవరి 10

1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.
1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.
1911 : భారత్ లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1923 : X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం.(జననం.1845)
1931 : కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.
2010 : భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.మరణం
2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్‌ల్స్ విల్సన్ మరణం.

ఫిబ్రవరి 11

1847 : ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం.
1865 : ప్రముఖ హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం.
1917 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.
1922 : సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
1942 : పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ మరణం.
1968 : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణం.
1969 : అమెరికన్ నటీమణి జెన్నిఫర్ అనిస్టన్ జననం.
1974 : సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం.
1977 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మరణం.

ఫిబ్రవరి 12

1809 : పూర్వపు అమెరికా అద్యక్షుడు అబ్రహం లింకన్ జననం.
1809 : జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతి వరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం.
1878 : స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం.
1942 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జననం.
1964 : తెలుగు సినిమా నటుడు జగపతి బాబు జననం.
1967 : తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.
1968 : తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం.
1976 : భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.

ఫిబ్రవరి 13

1879 : స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి సరోజినీ నాయుడు జననం.
1880 : సుప్రసిద్ధ పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం.
1911 : నవీన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం.
1914 : సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు మాదాల నారాయణస్వామి జననం.
1930 : ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు నూతి శంకరరావు జననం.
1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయించబడినది.
1971 : మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం.
1974 : బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.

ఫిబ్రవరి 14

ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే)
1779 : నావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు జేమ్స్ కుక్ మరణం (జ.1728).
1898 : విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం (మ.1992).
1921 : ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జననం (మ.1954).
1931 : మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ జననం (మ.2008).
1952 : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ జననం.
1973 : తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు వై.వి. రావు మరణం (జ.1903).
1983 : ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం (జ.1935).

ఫిబ్రవరి 15

1564 : ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో (గెలీలియో గలీలీ) జననం.
1827 : అమెరికాకు చెందిన ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.
1869 : ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.
1921 : చరిత్రకారుడు, బీహార్ కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.
1948 : ప్రముఖ హిందీ కవయిత్రి en:సుభద్రాకుమారి చౌహాన్ జననం.
1956 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.
2001 : మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది.

ఫిబ్రవరి 16

1944 : భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే మరణం (జ.1870).
1954 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మజీ క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్ జననం.
1956 : భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా మరణం (జ.1893).
1961 : ఆర్ధిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం (జ.1902).
1964 : పారిశ్రామికవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జననం.
1985 : తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత నార్ల వెంకటేశ్వరరావు మరణం (జ.1908).
2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

ఫిబ్రవరి 17

1954 : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జననం.
1963 : అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖేల్ జెఫ్రీ జోర్డాన్ జననం.
1981 : అమెరికాకు చెందిన ప్రసార మాధ్యమాల ప్రముఖురాలు, మోడల్, గాయని, రచయిత్రి, ఫ్యాషన్ డిజైనర్ మరియు నటి ప్యారిస్ హిల్టన్ జననం.
1984 : భారతీయ సినిమా నటీమణి సదా జననం.
1986 : ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం (జ.1895).
1987 : ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు అసీం త్రివేదీ జననం.
2000 : మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

ఫిబ్రవరి 18

క్రీ.పూ.3102 : కలియుగము ప్రారంభమైనది.
1486 : రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు చైతన్య మహాప్రభు జననం (మ.1534).
1564 : ఇటలీ కి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు మైఖేలాంజెలో మరణం (జ.1475).
1745 : బ్యాటరీ ని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెసాండ్రో వాల్టా జననం (మ.1827).
1836 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (జ.1886).
1939 : భారతీయ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ మరణం (జ.1888).
1994 : భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు గోపీకృష్ణ మరణం (జ.1933).

ఫిబ్రవరి 19

1473 : సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ జననం.
1564 : భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త గెలీలియో గెలీలి జననం.(మ.1642)
1630 : ఛత్రపతి శివాజీ జననం.(మ.1680)
1905 : ప్రముఖ సినిమా రచయిత వెంపటి సదాశివబ్రహ్మం జననం.
1915 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం.
1930 : ప్రముఖ దర్శకుడు, కళాతపశ్వి కె. విశ్వనాథ్ జననం.
1941 : కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు మరణం.
1956 : ఆచార్య నరేంద్ర దేవ్ మరణం.
1965 : గుజరాత్ యొక్క రెండవ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా జననం.

ఫిబ్రవరి 20

1901 : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు జననం (మ.1978).
1925 : నేపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు గిరిజాప్రసాద్ కొయిరాలా జననం (మ.2010).
1935 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి జననం.
1973 : తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం (జ.1921).
1987 : అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1989 : తెలుగు సినిమా నటీమణి శరణ్య మోహన్ జననం.
2010 : తెలుగు సినిమా హాస్యనటుడు బి.పద్మనాభం మరణం (జ.1931).

ఫిబ్రవరి 21

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
1894: ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం (మ.1955).
1971: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణం (జ.1902).

ఫిబ్రవరి 22

1556 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ మరణం (జ.1508).
1732 : అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జననం (మ.1799).
1847 : స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది.
1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య జననం (మ.1949).
1939 : ప్రముఖ బాల సాహిత్య రచయిత కలువకొలను సదానంద జననం.
2009 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణం (జ.1914).
1958 : ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం (జ.1888).
1997 : బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం (జ.1920).

ఫిబ్రవరి 23

ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.
1483 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం (మ.1531).
1503 : ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం (జ.1408).
1855 : సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ మరణం (జ.1777).
1913 : ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం (మ.1971).
1941 : అణుబాంబు ల తయారీలో వాడే రసాయన పదార్థం ప్లుటోనియం ను కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు.
1957 : తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు జననం (మ.2012).
1982 : భారతదేశ టెలివిజన్ నటుడు మరియు మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ జననం.
1966 : దళిత కళాకారిణి మరియు కవయిత్రి చంద్రశ్రీ జననం.
2009 : 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

ఫిబ్రవరి 24

1810 : బ్రిటిష్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ మరణం (జ.1731).
1911 : ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి వంటి పత్రికలకు సహాయ సంపాదకత్వం వహించిన నవలా రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం.
1948 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జననం.
1951 : ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు కట్టమంచి రామలింగారెడ్డి మరణం (జ.1880).
1980 : ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం(జ.1897).
1984 : బాలానందం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు మరణం (జ.1905).
1986 : ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ మరణం (జ.1904).
2013 : ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు షేక్ సాంబయ్య మరణం (జ.1950).

ఫిబ్రవరి 25

1894 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా జననం (మ.1969).
1961 : ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం (జ.1891).
1966 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డాన్ అరుణసిరి జననం.
1974 : భారతీయ సినిమా నటి దివ్యభారతి జననం (మ.1993).
1981 : బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జననం.
1998 : ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
2004 : తెలుగు సినీ నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి మరణం (జ.1912).

ఫిబ్రవరి 26

1802 : సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త విక్టర్ హ్యూగో జననం.
1829 : బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు లెవీ స్ట్రాస్ జననం.
1932 : ప్రముఖ సామాజిక సేవకురాలు హేమలతా లవణం జననం.
1869 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా అఫ్జల్ ఉద్దౌలా మరణం.
1982 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఎలకా వేణుగోపాలరావు జననం.
1887 : పాశ్చాత్య వైద్యం లో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి మరణం.
1962 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు మరణం.
1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్ర ను అహ్మదాబాదులో ప్రారంభం.

ఫిబ్రవరి 27

1803 : ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
1931 : భారతీయ స్వాతంత్ర్యోద్యమకారుడు చంద్రశేఖర్ అజాద్ మరణం (జ.1906).
1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).
1932 : సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం (మ.1997).
1956 : లోక్‌సభ మొదటి స్పీకరు జి.వి.మావలాంకర్ మరణం (జ.1888).
1972 : తెలుగు సినిమా హాస్యనటుడు శివాజీ రాజా జననం.
2002 : అహమ్మదాబాదు వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
2005 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు పుహళేంది మరణం.

ఫిబ్రవరి 28

జాతీయ విజ్ఞాన దినోత్సవము.
దర్జీ ల దినోత్సవము.
1927 : భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం (మ.2002).
1928 : ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం (మ.2011).
1948 : ప్రముఖ రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం.
1963 : భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం (జ.1884).
1976 : అమెరికన్ నటి మరియు మాజీ ఫ్యాషన్ మోడల్ అలీ లార్టర్ జననం.
2014 : బహుగ్రంథ రచయిత, సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టు స్థాపకుడు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణం (జ.1926).

చరిత్రలో జనవరి మాసం

జనవరి 1

1877: 1866 నాటి డొక్కల కరువు నాడు పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి కి సన్మానసభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
1894 : బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం.
1909 : వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు చర్ల గణపతిశాస్త్రి జననం (మ.1996).
1940 : తెలుగు గ్రంథకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1865).
1951 : ప్రముఖ ఉర్దూ కవి అష్ఫక్ హుస్సేన్ జననం.
1955 : ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (జ.1894)
1972 : మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణం (జ.1941).

జనవరి 2

1910: మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) జన్మించారు.
1922: నోబెల్ బహుమతి గ్రహీత, డా.హరగోవింద ఖురానా జన్మించారు.
2007: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు.

జనవరి 3

1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు కథా రచయిత చేతన్ ఆనంద్ జననం.(మ. 1997)
1831 : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీ ఫులే జననం.
1981 : ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్ అయ్యర్‌ జననం.
1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరో ను ప్రవేశపెట్టారు.
2013 : ప్రముఖ వాయులీన విధ్వాంసులు ఎం.యస్. గోపాలకృష్ణ మరణం.(జ. 1931)

జనవరి 4

1643 : సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం.(మ.1727)
1809: అంధులకు ప్రత్యేక లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ జననం.
1915: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి జననం.(మ.1996)
1945 : నటుడు, నాటక రచయిత, దర్శకుడైన ఎస్.కె. మిశ్రో జననం.
1988 : భారత దేశంలో మొట్టమొదటి "టెస్ట్ ట్యూబ్ బేబీ" ని ప్రముఖ వైద్యులు ఇందిరా హిందుజా జన్మింపజేశారు.
2007: ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు మరణం. (జ.1936)

జనవరి 5

ప్రపంచ పాల దినోత్సవం
1531 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరణం.(జ.1483)
1592 : మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్ జననం.(మ.1668)
1893 : భారత దేశం లో ప్రముఖ గురువు పరమహంస యోగానంద జననం.(మ.1952)
1931 : తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జననం.
1955 : పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ జననం.
1968 : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అర్జున్ ముండా జననం.
1971 : మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య జరిగింది.
1973 : బాలీవుడ్ నటుడు,నిర్మాత, సహాయ దర్శకుడు ఉదయ్ చోప్రా జననం.
1986 : భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి. దీపిక పడుకొనే జననం.

జనవరి 6

1847 : ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం.(జ.1767)
1852 : గుడ్డివారికి లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం.(జ.1809)
1867 : స్వాతంత్ర సమరయోధుడు బయ్యా నరసింహేశ్వరశర్మ జననం.
1929 : మదర్ తెరెసా భారత దేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
1932 : ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి జననం.
1959 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ జననం.
1966 : ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు ఎ.ఆర్.రెహమాన్ జననం.
1971 : ప్రసిద్ధ భారతీయ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మరణం.

జనవరి 7

1927 : కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ జననం.
1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
1937 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర జననం.
1950 : సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం.
1964 : అమెరికన్ నటుడు నికోలస్ కేజ్ జననం.

జనవరి 8

1642 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.గెలీలియో గెలీలి మరణం.(జ.1564)
1942 : వోటార్‌న్యూరాన్‌ వ్యాధితో అంగుళమైనా కదలలేని స్థితిలో ఉన్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ విలియం హాకింగ్ జననం.
1962 : లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి 'మోనాలిసా' పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.
1975 : తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ జననం.
1983 : ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడు తరుణ్ జననం.
1983 : తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న జననం.
1987 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నానా జోషి మరణం.(జ.1926)
1994 : కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపర లో 68వ వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మరణం.(జ.1894)

జనవరి 9

ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915 లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.
1922 : నోబెల్‌ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడుహరగోవింద్ ఖురానా జననం. (మ.2011)
1934 : భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ జననం.(మ.2008)
1965 : భారతీయ సినిమా దర్శకులు, నటి మరియు కొరియాగ్రాఫర్ ఫరా ఖాన్ జననం.
1968 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం.
1969 : మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
1982 :ల బృందం మొదటిసారి అంటార్కిటికా ను చేరింది.
2009 : ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.

జనవరి 10

1863 : లండన్‌లో భూగర్భరైల్వే ప్రారంభం.
1894 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం జననం.
1920 : నానాజాతి సమితిలో భారత్‌ సభ్యత్వం పొందింది.
1940 : భారత దేశ సినీ నేపద్య గాయకుడు,సంగీత విధ్వాంసుడు యేసుదాస్ జననం.
1946 : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తొలి సమావేశం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ సెంట్రల్‌హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 51 దేశాలు హాజరయ్యాయి.
1966 : పూర్వ భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి మరణించాడు.
1972 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం మరణించాడు.
1973 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించబడినది.

జనవరి 11

1922 : మధుమేహ రోగులకు ఇన్సులిన్‌ వాడకం ప్రారంభించిన రోజు.
1928 : ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత మరియు కవి థామస్ హార్డీ మరణం.
1944 : భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ జననం.
1966 : మహానుభావుడు భారత దేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం.
1973 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ జననం.
1991 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ మరణం.
2008 : న్యూజీలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం.

జనవరి 12

1863 : ప్రముఖ హిందూ యోగి స్వామి వివేకానంద జననం.(మ.1902) ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.
1869 : భారతీయ తత్వవేత్త భగవాన్ దాస్ జననం.
1895 : ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జననం.(మ.1948)
1896 : అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు.
1908 : చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ జననం.
1998 : పంతొమ్మిది యూరోపియన్‌ దేశాలు మానవ క్లోనింగ్‌పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.
2004 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మరణం.

జనవరి 13

1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు
1879 : 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జననం.
1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
1919 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం.
1930: వాల్ట్‌డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర 'మిక్కీ మౌస్‌' కామిక్‌ స్ట్రిప్‌ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఆమోదం లభించింది.
1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం.
1977 : ఆంగ్ల సినీనటుడు ఒర్లాండో బ్లూమ్ జననం.
1983 : భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.

జనవరి 14

ఇస్లామీయ కేలండర్ ప్రకారం మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 12 వ తేదీన ముహమ్మద్ ప్రవక్త , మక్కా పట్టణం లో జన్మించారు. వీరి జయంతినే మీలాదె నబి అనీ అంటారు. ఈ తేదీనే వీరు పరమదించారు కూడా.
1742 : ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు మరియు భౌతిక శాస్త్రవేత్త ఎడ్మండ్‌ హేలీ మరణం.(జ.1656)
1857 : ఇండియన్ బ్యాంకు, హిందూ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జననం.
1875 : ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ జననం.
1892 : 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌'గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం.
1896 : స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్ సి.డి.దేశ్‌ముఖ్ జననం. (మ.1982)
1937 : ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కధా నాయకుడు శోభన్ బాబు జననం.
1951: తెలుగు సినీ రచయిత , దర్శకుడు, హాస్య బ్రహ్మ జంద్యాల జననం,(మ.2001) .
ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు రావు గోపాలరావు జననం
1969 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చారు.
1987 : దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్‌ నుంచే ప్రారంభమయ్యాయి.

జనవరి 15

1887 : ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం (మ.1943).
1915 : ప్రముఖ తెలుగు రచయిత, చాసో గా అందరికీ సుపరిచితుడు చాగంటి సోమయాజులు జననం (మ.1994).
1929 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం (మ.1968).
1929 : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గా పనిచేసిన రాంలాల్ జననం (మ.2002).
1934 : భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ వి. ఎస్. రమాదేవి జననం (మ.2013).
1940 : వాడుక భాష ఉద్యమ పిత గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
1967 : తెలుగు సినిమా నటి భానుప్రియ జననం.
1998 : పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా మరణం (జ.1898).

జనవరి 16

1938 : ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి మరణం (జ.1885).
1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1942 : ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి జననం.
1943 : ప్రముఖ సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి మరణం (జ.1887).
1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.
1988 : భారత దేశపు ఆర్థిక వేత్త ఎల్.కె.ఝా మరణం (జ.1913).

జనవరి 17

1706 : గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం.
1905 :ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ జననం.
1908 : తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ జననం.
1917 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు, ఎం.జి.రామచంద్రన్ జననం.
1951 : భారతీయ సినిమా నటి బిందు జననం.
1989 : మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
1997 : ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.
2010 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసిన జ్యోతిబసు మరణం.

జనవరి 18

1927 : భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
1927 : సుప్రసిద్ధ సంగీత విధ్వంసుడు సుందరం బాలచందర్ జననం.(మ.1990)
1936 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ మరణం.
1947 : భారతీయ గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మరణం.
1950 : ప్రముఖ హేతువాది, సాహితీకారుడు అదృష్టదీపక్ జననం.
1972 : భారత క్రికెట్ ఆటగాడు జననం వినోద్ కాంబ్లి జననం.
1978 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం
1996 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు మరణం
2003 : ప్రముఖ కవి హరి వంశ రాయ్ బచ్చన్ మరణం (జ.1907)

జనవరి 19

1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ మరణించాడు.
1736 : ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఆవిరి యంత్రంతోప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం.(మ.1819)
1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.(b. 1817)
1918 : తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం.
1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం.
1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.
1990 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం.(జ.1931)

జనవరి 20

1265 : లండను‌ లోని వెస్ట్‌మినిస్టర్‌ భవనం లో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
1900 : సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
1907 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
1940 : తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.
1957 : భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు.
1960 : ప్రముఖ తెలుగు సినీనటి విజయ నిర్మల కుమారుడు ,హాస్య నటుడు మరియు రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
1964 : భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు మరియు రచయిత ఫరీద్ జకారియ జననం.
1995 : తాజ్‌మహల్‌ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమల ను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
1995 : రష్యా రూబుల్ విలువ కనిష్ట స్థాయికి (ఒక్క డాలర్ కు 3,947 రూబుళ్ళు) పడిపోయింది.

జనవరి 21

1924 : రష్యా నాయకుడు లెనిన్ మరణం.(జ.1870)
1945 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రాష్ బిహారీ బోస్ మరణం.
1959 : ప్రముఖ తెలుగు రచయిత ఎండ్లూరి సుధాకర్ జననం.
1950 : ప్రసిద్ధి చెందిన ఒక ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ మరణం.(జ.1903)
1972 : త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
2011 : తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ మరణం.

జనవరి 22

1666 : ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్‌ నిర్మాత షాజహాన్ మరణం (జ.1592).
1882: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం (మ.1962).
1885: ఆంధ్ర పితామహ గా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు జననం (మ.1970).
1900 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త మరియు సంగీత కారుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ మరణం (జ.1831).
1901: అరవైమూడేళ్లపాటు యునైటెడ్ కింగ్‌డమ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన విక్టోరియా మహారాణి మరణం (జ.1819).
1909: ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ జననం (మ.1974).
1940 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
1972: స్వామి రామానంద తీర్థ మరణం (జ.1903).
2014 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (జ.1923).

జనవరి 23

1863 : భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకుడు, ధర్మసమాజ స్థాపకుడు వావిలికొలను సుబ్బారావు జననం (మ.1939).
1890 : ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ జననం (మ.1978).
1897: నేతాజీ సుభాష్ చంద్ర బోసు కటక్‌ ఒరిస్సా లో జననం (మ.1945).
1911 : హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక జానంపల్లి కుముదినీ దేవి జననం (మ.2009).
1926 : శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే జననం (మ.2012).
1972 : స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు కె. అచ్యుతరెడ్డి మరణం (జ.1914).
1978 : ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ మరణం (జ.1890).
1989 : ప్రఖ్యాత చిత్రకారుడు సాల్వడార్ డాలీ మరణం (జ.1904).

జనవరి 24

1924 : స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం.
1950 : జనగణమన గీతాన్ని జాతీయ గీతం గా భారత ప్రభుత్వం స్వీకరించింది.
1950 : రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగింది.
1966 : సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ భాభా మరణం.
1980 : పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన ముదిగొండ లింగమూర్తి మరణం.
1981 : తొలితరం నటీమణులలో ప్రసిద్ధులైన చిత్తజల్లు కాంచనమాల మరణం.
2005 : తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి మరణం.
2011 : ప్రముఖ సంగీతకారుడు, భారత రత్న గ్రహీత భీమ్‌సేన్ జోషి మరణం.

జనవరి 25

అంతర్జాతీయ ఉత్పాదకత దినోత్సవం
1736 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ జననం.
1882 : ఇంగ్లీష్ రచయిత, ప్రచురణకర్త, కథానికల రచయిత వర్జీనియా వూల్ఫ్ జననం.
1918 : ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి జననం.
1925 : ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. పి. అచ్యుతరాం జననం.
1954 : ప్రముఖ హేతువాది, మానవవాది ఎం.ఎన్.రాయ్ మరణం.
1980: విశ్వమాత మదర్ థెరీసా ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
2004: అమెరికా ప్రయోగించిన ఆపర్చ్యూనిటీ వ్యోమ నౌక అంగారక గ్రహం మీద క్షేమంగా దిగింది.

జనవరి 26

1925 : ప్రసిద్ది చెందిన అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది పాల్ న్యూమాన్ జననం.
1935 : తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత , రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు భావశ్రీ జననం.
1950 :భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1956 : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జననం.
1968 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు రవితేజ జననం.
2010 : తెలుగు సినిమా ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం.

జనవరి 27

1926: మొట్టమొదటి సారి టెలివిజన్ ను - లండన్ లో - ప్రదర్శించారు.
1928: ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది, కళాప్రపూర్ణ, పోతుకూచి సాంబశివరావు జననం.
1974 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు చమిందా వాస్ జననం.
1979 : ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు డానియెల్ వెట్టోరీ జననం.
1986 : ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు అనగాని భగవంతరావు మరణం.
1988: భారత్ లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
2009 : ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు రామస్వామి వెంకట్రామన్ మరణం.

జనవరి 28

1865: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్ జననం.
1885 : ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి జననం.
1920 : 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత బి.విఠలాచార్య జననం.
1930 : హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు పండిట్ జస్రాజ్ జననం.
1955 : ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా జననం.
1898: వివేకానందుని ప్రబోధాలతో ప్రభావితమై సిస్టర్ నివేదిత భారత్ వచ్చింది.
1929 : భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం.

జనవరి 29

1901 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు మొసలికంటి తిరుమలరావు జననం.
1920 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంత రావు జననం.
1932 : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు పంగులూరి రామన్ సుబ్బారావు జననం.
1936 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం.
1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
1951 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జననం.
1970 : భారతీయ షూటర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ జననం.

జనవరి 30

అమర వీరుల దినోత్సవం.
1889 : ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు జయశంకర్ ప్రసాద్ జననం.
1910 : భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడిన సి.సుబ్రమణ్యం జననం.
1913 : ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ జననం.
1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ చర్మవైద్యులు బెండపూడి వెంకట సత్యనారాయణ జననం.
1948 : జాతిపిత మహాత్మా గాంధీ ని నాథూరాం గాడ్సే హత్య చేసాడు.
1981 : బల్గేరియన్ ఫుట్ బాల్ ఆటగాడు డిమిటార్ బెర్బటోవ్ జననం.

జనవరి 31

1865 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శాస్త్రీజీ మహరాజ్ జననం.
1902 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ జననం.
1905 : ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు కందుకూరి రామభద్రరావు జననం.
1926 : తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు జననం.
1969 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా మరణం.
1975 : ప్రముఖ భారతీయ సినీనటి ప్రీతీ జింతా జననం.
2004 : ప్రముఖ హిందీ నటి ,గాయని సురయ్యా మరణం.
2009 : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు నగేష్ మరణం.