స్వామి వివేకానంద సూక్తులు

1. దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరారు. ఈ ప్రపంచంలోని ఘోరమైన బాధలన్నింటికీ అసలు కారణం భయమే. భయమే మన దుఃఖాలన్నిటికి ఏకైక కారణం. నిర్భయత్వం క్షణంలో మనకు స్వర్గాన్ని కొనితేగలదు. కాబట్టి లేవండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకునే వరకూ ఆగకండి! నిర్భయంగా ఉండండి

2. శక్తి అంతా మీలోనే ఉంది. మీరు ఏమైనా చెయ్యగలరు. అన్నీ చెయ్యగలరు. దీన్ని నమ్మండి. మీరు బలహీనులని భావించకండి. ధీరులై లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి.

3. ఓ సింహాల్లారా రండి! 'మేము గొర్రెలం' అని మీరు అనుకునేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు. స్వేచ్చాజీవులు, ధన్యులు, శాశ్వతులు, మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు. వస్తుసంపదలు మీ బానిసలు. మీరు వస్తుసంపదకు బానిసలు కారు.

4. మనకిప్పుడు కావలసినది ఏమిటంటే. వేదాంతంతో జతగూడిన పాశ్చాత్య శాస్త్ర్ర్ర విజ్ఞానం, మనల్ని సరైన దారిలో పెట్టే ఆదర్శంగా బ్రహ్మచర్యం. వాటితో పాటు శ్రద్ధ, ఆత్మవిశ్వాసం.

5. మహా వీరుడైన హనుమంతుణ్ణి మీ ఆదర్శంగా చేసుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈయన తన ఇంద్రియాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోవడమేకాక అద్భుతమైన సూక్ష్మబుద్ధి కలవాడు. గురువుకు ఏ మాత్రం ఎదురు చెప్పని విధేయత, కఠోరమైన బ్రహ్మచర్యం - ఇవే విజయరహస్యాలు.

6. లేచి నలబడి, ధైర్యంగా, బలంగా ఉండండి. బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి. మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి. తనమీద తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు: దేవుణ్ణి నమ్మనివాడు నాస్తికుడని పాతమతాలు చెప్పాయి. తన మీద తనకే నమ్మకం లేనివాడు నాస్తికుడని ఈ క్రొత్త మతం బోధిస్తోంది.

7. విజేతలదే ఈ ప్రపంచం. ఇదే సత్యం. అందుకే భయం వదలండి---విజేతలగా నిలవండి.

8. వేలమంది వందల ఏళ్ళ పాటు పనిచేసే కన్నా---మనస్పూర్తిగా,నిజయితీగా,శక్తిమంతంగా పనిచేసే కొద్దిమంది యువతీయువకులు చాలు ... ఈ ఫ్రపంచాన్ని మార్చేయటానికి!

9. జీవితంలో నేర్చుకోవల్సిన పాఠం ఒక్కటే " అన్యాయాలను,అక్రమాలను దైర్యంగా ఎదుర్కోవడం. మనం దైర్యంగా చెయ్యి విదిలించి ముందడుగేస్తే...అన్ని కష్టాలూ చెదిరిన కోతుల్లా పారిపోతాయి".

10. శక్తి అంతా నీలోనే ఉంది. నువ్వు తల్చుకుంటే ఏదైనా సాధించగలవు. నిన్ను బలహీనుడివని ఎప్పుడూ అనుకోకు. ధైర్యం చేస్తే... నీలోని దైవాన్ని నువ్వు దర్శించగలవు.

11. ధైర్యం,బలం,నిర్భయం _ _ _ ఇవే విజయానికి సోపానాలు."పిరికివానిలా ఎప్పుడూ చనిపోవద్దు- -పోరాటంలో వీరుడిగా మరణించడం ఎంతో మంచిది"

12. దెయ్యాలు,భూతాల గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు. "బలంగా ఉండేది,పురోగమించేదే జీవితం". 'నీరసమే మరణం'. "బలహీనంగా ఉందేవాటిని నమ్మొద్దు...బలహీనతలను దరికి చేరనీయొద్దు".

13. 'ప్రపంచంలో పుస్తకాలు లెక్కలేనన్ని ఉన్నాయి'. కాని మనకున్న సమయం చాలా తక్కువ. అందువలన "మనకు అవసరమైనదాన్ని ఒంటపట్టించుకోవడమే జ్ఞానం".

14. 'లక్ష్యం ఉన్నతంగా ఉండలి'. దాని కోసమే కృషిచెయ్యాలి. "సముద్రాన్ని చూడండి - - - అలలను కాదు".

No comments:

Post a Comment