ప్రేమ సూక్తులు

  • ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి. 
  • కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
  • ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.
  • ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.
  • ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది. 
  • జీవితం పువ్వులాంటిది. అందులోని మకరందమే ప్రేమ.
  • నిజానికి ప్రేమ కలిగించేటంత బాధ, వ్యధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించవు. రానంతసేపు రాలేదనే బాధ, వచ్చాక విడిపోతామేమోననే బాధ, ఇదే ప్రేమంటే.
  • ప్రేమ నాదం లాంటిది. మీటితే అనురాగాన్ని ఇస్తుంది.
          ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది.
  • ప్రేమ స్వతహాగా రావాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు.
  • ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది
  • ప్రేమ ఉన్నతమైనదని చాటి చ్పెపిన తొలి వ్యక్తి విషాదాన్నే చవి చూసుంటాడు.
  • ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
  • పెళ్ళయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నింటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
  • ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
  • ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు” 
  • ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి. 
  • ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమిని దున్నాలి. స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి. ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి. కులమతం, రాజకీయం అనే చీడల నుండి రక్షించుకోవాలి. అప్పుడుగానీ ప్రేమ అనే పైరు చేతికిరాదు.”
  • ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది.
  • ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో... 

No comments:

Post a Comment